Manchu Mohan Babu: దాడికి ఉద్రిక్తతే కారణం.. మోహన్ బాబు సంచలన లేఖ
జర్నలిస్ట్(Journalist) పై జరిగిన దాడికి స్పందిస్తూ.. సినీ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu) మీడియాకు సంచలన లేఖ(Letter) రాశారు.
దిశ, వెబ్ డెస్క్: జర్నలిస్ట్(Journalist) పై జరిగిన దాడికి స్పందిస్తూ.. సినీ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu) మీడియాకు సంచలన లేఖ(Letter) రాశారు. దాడికి ఉద్రిక్తత చోటు చేసుకోవడమే ప్రధాన కారణమని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో మోహన్ బాబు.. ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడానికి విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాస్తున్నానని తెలిపారు. వ్యక్తిగత కుటుంబ వివాదంగా మొదలైనది కాస్త పెద్ద పరిస్థితికి దారితీసిందని, ఈ సంఘటనలో బాధితులైన వారికే గాక విస్తృత జర్నలిస్ట్ సోదర వర్గానికి కూడా బాధ కలిగించడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆరోగ్య కారణాల వల్ల గత 48 గంటలు ఆసుపత్రిలో చేరానని, అందుకే ఈ ఘటనపై వెంటనే స్పందించలేకపోయానని తెలిపారు.
ఈ సంఘటనలో క్షణాల్లో గేటు విరిగిపోయి, దాదాపు 30-50 మంది వ్యక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు, అక్కడ ఉన్నవారికి హాని చేయాలనే ఉద్దేశ్యంతో బలవంతంగా నా ఇంట్లోకి చొరబడటంతో తాను ప్రశాంతతను కోల్పోయానని చెప్పారు. ఈ గందరగోళం మధ్య మీడియా అనుకోకుండా పరిస్థితిలో చిక్కుకుందని, తాను పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. మీ జర్నలిస్టులలో ఒకరైన రంజిత్‌కు దురదృష్టవశాత్త గాయమైందని తెలిపారు. ఇది చాలా విచారించదగ్గ పరిణామం అని, అతనికి, అతని కుటుంబానికి మీడియా కమ్యూనిటీకి కలిగిన బాధ, అసౌకర్యానికి తాను తీవ్రంగా చింతిస్తున్నానని అన్నారు. రంజిత్ కుటుంబ సభ్యులకు బాధ కలిగించిన నా చర్యలకు హృదయపూర్వకంగా క్షమాపణలు(Sorry) కోరారు. అంతేగాక త్వరగా కోలుకోవాలని మోహన్ బాబు కోరుకున్నారు.