MP Mallu Ravi : కేసీఆర్ పై మల్లు రవి సంచలన కామెంట్లు

బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) పై కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) సంచలన కామెంట్లు చేశాడు.

Update: 2024-11-28 12:11 GMT
MP Mallu Ravi : కేసీఆర్ పై మల్లు రవి సంచలన కామెంట్లు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) పై కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) సంచలన కామెంట్లు చేశాడు. కేసీఆర్ మోడీ చేతిలో కీలు బొమ్మగా మారాడని వ్యాఖ్యలు చేశారు. దేశ్ కి నేతా అంటూ ఎంతో ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ఆఫీసు ఎందుకు కట్టారో ఆయనకే తెలియాలి అన్నారు. మహారాష్ట్రలో ఘనంగా పార్టీ ప్రారంభించిన ఆయన.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. ఎందుకంటే మోడీ పోటీ చేయవద్దని కేసీఆర్ కు ఆదేశాలు జారీ చేశాడు కాబట్టి సైలెంట్ గా ఉన్నాడని.. ఇప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకుంటే బాగుంటుందని మల్లు రవి ఎద్దేవా చేశారు. ఎప్పుడైనా బీజేపీ పెద్దలు చెప్పిందే గులాబి నేతలు తూచా తప్పకుండా చేస్తారని.. ఆ రెండు పార్టీలు ఒక్కటే అని ఆరోపణలు చేశారు. 

Tags:    

Similar News