కాంగ్రెస్ సీనియర్ నేతలకు మల్లు రవి స్ట్రాంగ్ కౌంటర్..

నూతనంగా ప్రకటించిన పీసీసీ కమిటీల్లో టీడీపీ నుండి వచ్చిన వారికే ఎక్కువ పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తోన్న ఆరోపణలకు మల్లు రవి కౌంటర్ ఇచ్చారు.

Update: 2022-12-17 13:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: నూతనంగా ప్రకటించిన పీసీసీ కమిటీల్లో టీడీపీ నుండి వచ్చిన వారికే ఎక్కువ పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తోన్న ఆరోపణలకు మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన 22 మంది తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఒక్క రేవంత్ రెడ్డి తప్ప.. టీడీపీ నుండి వచ్చిన వాళ్లు ఒక్కరు లేరని సీనియర్ల ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అంతేకాకుండా 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా టీడీపీ నుండి వచ్చిన వారు ఇద్దరే ఉన్నారని తెలిపారు. ఉపాధ్యక్ష పదవిలో 24 మందిలో ఐదుగురే టీడీపీ నుండి వచ్చిన వారు ఉన్నారని స్పష్టం చేశారు. 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో కేవలం ఐదుగురే టీడీపీ నుండి వచ్చిన వారు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క జిల్లాకు కూడా టీడీపీ నుండి వచ్చిన వారు డీసీసీ అధ్యక్షుడిగా లేరని వెల్లడించారు. నూతన కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, మెనార్టీలు 68 శాతం ఉంటే.. ఓసీలు 32 శాతం మాత్రం ఉన్నారని చెప్పారు.

ఇదిలా ఉంటే.. నూతన పీసీసీ కమిటీల్లో సీనియర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఓ వర్గం వారికే ఎక్కువ పదవులు కట్టాబెట్టారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్లంతా ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో భేటీ అయ్యి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కమిటీల అంశం కొలిక్కి వచ్చే వరకు పీసీసీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 

Tags:    

Similar News