మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన.. రజినీకాంత్ ‘జైలర్’ యాక్టర్ అరెస్ట్

విమానంలో ప్రయాణిస్తూ ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మళయాలం నటుడిని శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. త

Update: 2024-09-08 04:51 GMT

దిశ, శంషాబాద్: విమానంలో ప్రయాణిస్తూ ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మళయాలం నటుడిని శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. విమానంలో ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడని సీఐఎస్ఎఫ్ అధికారుల ఫిర్యాదు వచ్చింది. దీంతో నటుడు వినాయక్ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేయగా అతను మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజు తెలిపారు. దీనిపై వినాయక్ స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. సీఐఎస్ఎఫ్ అధికారులు తనను విమానాశ్రయంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ ఆరోపించారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని కోరాడు. కాగా, ఇటీవల వినాయకన్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో విలన్‌ పాత్ర పోషించిన విషయం తెలిసిందే.


Similar News