‘మేక్ ఇన్ తెలంగాణ’ను పెంపొందించాలి : మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రాన్ని ఉత్పాదక రంగంలో అగ్రగామిలా నిలపేలా ‘మేక్ ఇన్ తెలంగాణ’ భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.

Update: 2024-09-11 16:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రాన్ని ఉత్పాదక రంగంలో అగ్రగామిలా నిలపేలా ‘మేక్ ఇన్ తెలంగాణ’ భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. దేశీయ మార్కెట్లో తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ ఉండేలా నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. బేగంపేటలో బుధవారం క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ వార్షిక సదస్సును ప్రారంభించి మాట్లాడారు. పరిమాణంపైనే కాకుండా నాణ్యతకు ప్రాధాన్యతనిస్తే దేశమంతా తెలంగాణవైపు చూస్తుందన్నారు. కృత్రిమ మేథ వినియోగంపై ఉద్యోగులు, కార్మికులు, పరిశ్రమ ప్రతినిధులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఛాప్టర్ చైర్మన్ బాలకృష్ణరావు, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.


Similar News