Mahesh Kumar Goud : తిరుమల మృతులకు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం

తిరుపతి(Tirupati)లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు భక్తులు మృతి చెందడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు(TPCC Cheif) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2025-01-09 09:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి(Tirupati)లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు భక్తులు మృతి చెందడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు(TPCC Cheif) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇది అత్యంత విచారకర దుర్ఘటన అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించి వారిని ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని టీటీడీ(TTD) అధికారులను మహేష్ కుమార్ గౌడ్ కోరారు. కాగా బుధవారం రాత్రి తిరుమలలో శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందగా.. పలువురు ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News