మీరే కావాలి,మళ్ళీ మీరే రావాలి..

మీరే కావాలి,మళ్ళీ మీరే రావాలి' అని 150 మంది మహిళలు బీఆర్ఎస్ నాయకులకు దిష్టి తీసిన వైనం జిల్లాలో జరిగింది.

Update: 2024-12-24 14:44 GMT

 దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: 'మీరే కావాలి,మళ్ళీ మీరే రావాలి' అని 150 మంది మహిళలు బీఆర్ఎస్ నాయకులకు దిష్టి తీసిన వైనం జిల్లాలో జరిగింది. ఇటీవల నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పితృ వియోగం కలుగగా..ఆయనను పరమర్శించడానికి తిమ్మాజీపేట్ మండలం నేరపళ్లపల్లి మాజీమంత్రులు వెళుతున్నారు. ఈ క్రమంలో మాజీమంత్రులు కేటీఆర్,హారీష్ రావు,లక్ష్మారెడ్డి,శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యేలు,మాజీ చైర్మెన్లు,తదితర రాష్ట్ర నాయకులను మార్గమధ్యలోని నసుర్లాబాద్ గ్రామంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ ఆధ్వర్యంలో..దాదాపు 150 గుమ్మడి కాయలతో 'మీరే కావాలి,మళ్ళీ మీరే రావాలి' అంటూ ఆ దేవుడి ఆశీర్వాదం మీపై ఉంటుందని మహిళలు ముక్త కంఠంతో వారి అభిమానాన్ని చాటుకుంటూ దిష్టి తీశారు.


Similar News