ప్రభుత్వ కాలేజీలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

వీపనగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ కాలేజీలో రాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల కంప్యూటర్, సిపిఓ, సీసీ కెమెరాతో పాటు గ్రామంలోని పలు ఇళ్లు దగ్ధం అయ్యాయి.

Update: 2024-12-24 14:53 GMT

దిశ, వీపనగండ్ల: వీపనగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ కాలేజీలో రాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల కంప్యూటర్, సిపిఓ, సీసీ కెమెరాతో పాటు గ్రామంలోని పలు ఇళ్లు దగ్ధం అయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామంలోని ప్రధాన చౌరస్తా వద్ద లెవెన్ కె.వి విద్యుత్ తీగలు కలుసుకోవడంతో..ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగాయి. దీంతో గ్రామం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని పలు ఇండ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోగా..స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఆఫీస్ గదిలో ఉన్న కంప్యూటర్, సిపిఓ విద్యుత్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిపోయాయి. ఉదయాన్నే కాలేజీకి వచ్చిన అధ్యాపకులు, విద్యార్థులు ఆఫీస్ గదిలో నుంచి వస్తున్న పొగలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. గదిని తెరిచి చూడగా కంప్యూటర్ మానిటర్, సిపిఓ పాటు సీసీ కెమెరా, విద్యుత్ వైరింగ్ పూర్తిగా కాలిపోవడాన్ని గమనించారు. సుమారు 60 లక్షల రూపాయల మేర నష్టం వాటిలిందని, ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఇంచార్జ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారావీపనగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ కాలేజీలో రాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల కంప్యూటర్, సిపిఓ, సీసీ కెమెరాతో పాటు గ్రామంలోని పలు ఇళ్లు దగ్ధం అయ్యాయి.యణ తెలిపారు.


Similar News