భరోసా కేంద్రాలు నమ్మకమైన వేదికలు
బాధితుల సహాయానికి 'భరోసా'కేంద్రాలు ఓ నమ్మకమైన వేదికలుగా పనిచేస్తాయని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బాధితుల సహాయానికి 'భరోసా'కేంద్రాలు ఓ నమ్మకమైన వేదికలుగా పనిచేస్తాయని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన 'భరోసా కన్వర్జెన్స్' సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భరోసా కేంద్రం బాధితుల పునరావాసం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక మద్ధతు కేంద్రం అని,మహిళాల హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని ఆమె అన్నారు.ఈ కేంద్రం ద్వారా లైంగిక వేధింపులు,గృహ హింస,బాలలపై హింసకు గురైన బాధితులకు న్యాయం,వైద్యం,మానసిక మద్దతు అందించబడుతుందని ఆమె అన్నారు.బాధితులకు సత్వర న్యాయం అందించడం శారీరక,మానసిక,న్యాయ సేవలు సమగ్రంగా అందించడం,అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలలో చైతన్యం కల్పించడం,కేసుల విచారణ వేగవంతం చేయడం,పునరావాసం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు.మహిళలపై జరిగే నేరాలను నివారించడంలో భరోసా కేంద్రం చేసిన కృషి,ప్రస్తుతం అందిస్తున్న సేవల సమీక్ష,రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రణాళికలను ఆమె సమీక్షించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు,డిఎంహెచ్ఓ కృష్ణ,సిడబ్ల్యుసి చైర్మెన్ నయీమెద్ధీన్,జెజెబి ఛైర్పర్సన్ గ్రెస్,ఆఎంఓ శిరీష,డిఎస్పీలు వెంకటేశ్వర్లు,రమణారెడ్డి,ఆర్ఎంఓ జరీనా,సిఐ,ఎస్ లు,తదితర సంబంధిత అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.