సార్వత్రిక విద్య ప్రవేశాలకు గడువు పెంపు
సార్వత్రిక విద్యలో ప్రవేశాల కోసం ఈనెల 30వ తేదీ చివరి గడువు అపరాధ రుసుంతో పొడిగించినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ, పెద్ద కొత్తపల్లి: సార్వత్రిక విద్య ప్రవేశాల కోసం ఈనెల 30వ తేదీ చివరి గడువు అపరాధ రుసుంతో పొడిగించినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సార్వత్రిక 10వ తరగతిలో చేరడానికి కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 9010210290 ను సంప్రదించగలరనీ ఆయన పేర్కొన్నారు