కనిపించడం లేదు..ఆచూకీ తెలిస్తే చెప్పండి
మండలంలోని అమ్మపూర్ గ్రామానికి చెందిన ఎర్ర మందెల అఖిల్ అదృశ్యమైనట్లు తండ్రి దశరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దిశ, చిన్న చింతకుంట : మండలంలోని అమ్మపూర్ గ్రామానికి చెందిన ఎర్ర మందెల అఖిల్ అదృశ్యమైనట్లు తండ్రి దశరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..ఇంటి ముందు ఆడుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిపారు.దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఇళ్లల్లో పక్కన గ్రామాల్లో వెతికారు. ఎక్కడా కనిపించక పోవడంతో మంగళవారం సిసి కుంట పోలీస్ స్టేషస్ లో ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆర్ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రమందెల అఖిల్ ఎక్కడైనా కనబడితే 8712659354,8712659316 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ఆర్ శేఖర్ కోరారు.