స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంకితభావంతో పనిచేయాలి: కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రధాన భూమిక ఉన్నందున సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.

Update: 2023-05-11 14:34 GMT

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రధాన భూమిక ఉన్నందున సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ శిశువు పుట్టిన రోజు నుంచి వెయ్యి రోజుల వయసు వరకు శిశువు ఆరోగ్యానికి సంబంధించి చాలా కీలకమైన దశ అని, రోజు రోజుకు శిశువు ఆరోగ్య, మానసిక అభివృద్ధిపై శ్రద్ద పెట్టి తల్లులకు అవగాహన కల్పిస్తూ ఉండాలన్నారు.

ఏ దశలో అయిన ఎదుగుదల, కంటి, వినికిడి తదితర సమస్యలు వస్తే వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందేవిధంగా చూడాలన్నారు. తల్లులకు ఎప్పటికప్పుడు సరైన అవగాహన వల్ల మత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. గర్భిణుల రక్తహీనతపై ప్రత్యేక దృష్టి పెట్టి పౌష్ఠికాహారం, ఐరన్ మాత్రలు ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవం జరిగేవిధంగా చూడాలన్నారు. రెస్క్యూ చేసిన 23 మంది అనాధ పిల్లలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకుల, సంక్షేమ పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

వృద్ధాశ్రమాల్లో ఉంటున్న 107 మంది వృద్ధుల అరోగ్య సంరక్షణ ఎలా చూస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై తదుపరి సమావేశంలో నివేదిక ఇవ్వాల్సిందిగా సంక్షేమ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని వెంకటలక్ష్మి, సఖీ అధికారిణి సునీత, డీసీపీఓ  నిరంజన్,  సీడీపీఓ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News