ఏంది సామీ ఇదీ..ఇదో వింత దొంగతనం

గద్వాల మండలం పూడూర్ గ్రామంలో వింత దొంగతనం జరిగింది.

Update: 2024-10-09 13:13 GMT

దిశ, గద్వాల : గద్వాల మండలం పూడూర్ గ్రామంలో వింత దొంగతనం జరిగింది. త్రాగనీటీ అవసరం కోసం వేసిన బోరు మోటార్ కు సంబంధించిన స్టార్టర్ డబ్బాను పట్టా పగలే గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం శోచనీయమని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్ళగా.. మధ్యాహ్నం వేళలో ఇళ్లలో సైతం దొంగతనాలు జరుగుతున్నాయని బాధితులు తెలిపారు. గ్రామానికి సమీపంలో ఉండే జంగంపల్లిలో రెండు రోజుల క్రితం ప్రకృతి వనంలో ఉండే మోటార్ వైర్లు, స్టార్టర్ చోరీ సంఘటన మరవక ముందే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం శోచనీయమని స్థానికులు వాపోతున్నారు. గతంలో 3 లక్షలు రూపాయలతో గ్రామస్తులు సి.సి కెమెరాలు ఏర్పాటు చేశారు. సిసి కెమెరాలు వీధి విద్యుత్ పోల్స్ దగ్గర కొన్ని రోజులు దర్శనం ఇచ్చి కన్పించకుండా పోయాయని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామ కార్యదర్శి, పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News