రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
దిశ, వీపనగండ్ల: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పుల్గర్ చర్ల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని గ్రామ సర్పంచ్ ఎద్దుల అరుణమ్మ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ముఖ్యమంత్రి సహాయనిధి, ఆసరా ఫించన్లు, కంటివెలుగు వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు అని అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే దిక్సూచి అని అన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని, కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణాలు, పంట పొలాలకు ప్రత్యేక కాలువలు తవ్వించి సాగునీరు అందించడం జరిగిందన్నారు.
సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాలదిన్నె రిజర్వాయర్ వరకు ప్రత్యేక కాలువ నిర్మాణం కోసం నిధులు కేటాయించి పనులు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో ఓ నాయకుడు కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ కాకుండా అడ్డుకున్నాడని అన్నారు. బీజేపీ పార్టీకి చెందిన ఓ నాయకుడు సోమశిల, సిద్దేశ్వరం హైదరాబాద్ జాతీయ రహదారిని తీసుకురావడం జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. సమావేశానికి ముందు గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. పుల్గర్ చర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వరరావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, సర్పంచులు రఘునాథ్ రెడ్డి, అంజయ్య, విజయ్ కుమార్, రామేశ్వరరావు, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, నాయకులు ముంత మల్లయ్య కోటిరెడ్డి, కోదండమ్ యాదవ్, రవీందర్ రెడ్డి, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.