దిశ, మదనాపురం: మండల పరిధిలోని దంతనూరు గ్రామంలో ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే వారు కరువయ్యారని వాపోతున్నారు గ్రామంలో గత నాలుగు రోజులుగా మంచినీరు సరఫరా కాకపోవడంతో బావుల వద్దకు వెళ్లి నీటిని పట్టుకుంటున్నట్లు తెలిపారు నీటి ఎద్దడిని గమనించి కొందరు ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కాకపోయినా పట్టించుకునే దిక్కు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పక్కనే సరళ సాగర్ జలాశయం ఉన్నప్పటికీ తమకు తాగునీటి కష్టాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పై అనేక మార్లు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకునే దిక్కు లేదని తెలిపారు సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని దంతనూరు ప్రజలు కోరుతున్నారు