ఎంబిబిఎస్ లో సీటు దాతల కోసం ఎదురుచూపు

చదువుల తల్లి కొలువై ఉన్న కల్వరాల గ్రామంలో ఒపేదింటి విద్యార్థి వైద్య రంగంలో రాణించాలని లక్ష్యంతో ప్రతిష్టాత్మకైనా నీట్ పరీక్షలో ఉన్నత ర్యాంకు సాధించింది.

Update: 2024-10-09 15:43 GMT

దిశ,వీపనగండ్ల: చదువుల తల్లి కొలువై ఉన్న కల్వరాల గ్రామంలో ఒపేదింటి విద్యార్థి వైద్య రంగంలో రాణించాలని లక్ష్యంతో ప్రతిష్టాత్మకైనా నీట్ పరీక్షలో ఉన్నత ర్యాంకు సాధించింది. మెడికల్ కాలేజీలో సీట్ సాధించిన పేదరికంలో పుట్టిన ఆమెకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవటంతో వైద్య విద్యను అభ్యసించడానికి దాతల సహకారం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. మండల పరిధిలోని కల్వరాల గ్రామానికి చెందిన బోరెల్లి నరసింహ శ్యామల కూతురు బోరెల్లి గౌరీ చిన్నతనం నుంచి చదువులో రాణిస్తూ..ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాలలో ఎంబిబిఎస్ చదవడానికి అర్హత సాధించింది. ఇంటర్ లో మంచి మార్కులు సాధించడంతో మెడిసిన్ చదవడానికి గౌలిదొడ్డిలో ని గురుకులంలో కోచింగ్ తీసుకుని నీట్ పరీక్ష ఫలితాలలో 435 మార్కులు సాధించింది. హైదరాబాద్ పటాన్ చెరువు మహేశ్వరం మెడికల్ కాలేజీలో సీట్ సాధించినట్లు విద్యార్థిని గౌరీ తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో...కళాశాల ఫీజు చెల్లించేందుకు దాతలు ముందుకు రావాలని గౌరీ తల్లిదండ్రులు నరసింహ శ్యామలమ్మ కోరుతున్నారు. కూలి పనులు చేసుకుని బ్రతికే తమకు దాతలు ముందుకు వచ్చి తమ కుమార్తె చదువుకు అండగా నిలవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆర్థిక సహాయం అందించే దాతలు 76740 33296 నెంబర్ కు సంప్రదించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.


Similar News