గిరిజన బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డయ్: వెంకటేష్ చౌహాన్ నాయక్
గిరిజన బతుకుల్లో మార్పు కోసం తెలంగాణ సాధన ముఖ్యమని ఎంతోమంది గిరిజన యువకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, కానీ సీఎం కేసీఆర్ సారధ్యంలో గిరిజనుల బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు మరింత ఆగమయ్యాయని బీఎస్పీ రాష్ట్ర గిరిజన నాయకులు వెంకటేష్ చౌహాన్ నాయక్ అన్నారు.
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : గిరిజన బతుకుల్లో మార్పు కోసం తెలంగాణ సాధన ముఖ్యమని ఎంతోమంది గిరిజన యువకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, కానీ సీఎం కేసీఆర్ సారధ్యంలో గిరిజనుల బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు మరింత ఆగమయ్యాయని బీఎస్పీ రాష్ట్ర గిరిజన నాయకులు వెంకటేష్ చౌహాన్ నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో సమావేశం ఏర్పాటు చేసిన గిరిజనుల అలయ్ బలయ్ సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం కేవలం గిరిజనులను ఓటు బ్యాంకు కోసమే వాడుకున్నాయని అన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారధ్యంలో ముందుకు వెళ్తే మన బతుకులు మారుతాయని అభివృద్ధి బాటలో పయనిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ ఇంచార్జి రమేష్ నాయక్, పీయూజేఏసీ రూప్ సింగ్ నాయక్, బీవీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బాబు నాయక్, బీఎస్పీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పశువుల రామకృష్ణ, జిల్లా ఇంచార్జి యోసేఫ్, జిల్లా అధ్యక్షుడు ధర్మయ్య, జిల్లా కార్యదర్శి బోనాసి రామచందర్, అసెంబ్లీ ఇంచార్జి కొత్తపల్లి కుమార్, అసెంబ్లీ అధ్యక్షుడు పృథ్వీరాజ్, మండల అధ్యక్షుడు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.