ఒరిగిన విద్యుత్‌ స్తంభం.. పొంచి ఉన్న ప్రమాదం

బిజినేపల్లి మండలం ఒరిగిన స్తంభంతో పెను ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Update: 2024-10-20 12:21 GMT

దిశ, బిజినేపల్లి: బిజినేపల్లి మండలం ఒరిగిన స్తంభంతో పెను ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో పాటు..వ్యవసాయ పొలాలకు రైతులు తిరిగే రహదారిపై ప్రమాదభరితంగా 11 కేవీ విద్యుత్ లైన్ స్తంభం సగానికి వాలి ఉంది. కారుకొండ గ్రామానికి కుంటలో నుంచి 11 కేవీ విద్యుత్ లైన్ స్తంభం సంవత్సరం క్రితం గాలివానలకు ఒరిగింది. స్తంభం ప్రమాదభరితంగా ఒరిగిందని గ్రామంలో ఉన్న ప్రజలు రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్పా.. ఇప్పటివరకు ఒరిగిన స్తంబాల న్ని సరి చేయట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు స్తంభం కింద పడి జరగరాని పెను ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలో గ్రామ ప్రజలు ఉన్నామని వాపోయారు. లెవెన్ కె.వి స్తంభాలు చెరువు కట్టపై కొత్తగా లైను వేయడం కోసం ఈ మధ్యకాలంలోనే విద్యుత్ లైన్ను వేసేందుకు కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్ స్తంభాలు నాటేందుకు గుంతలు తక్కువ లోతు తీయడంతో పాటు, నాసిరకం విద్యుత్ స్తంబాలు, నాటడంతో.. అవి కూడా నేలకు వొరిగాయని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాటిన కొత్త స్తంభాలను తీసుకొచ్చి ఆదరబాదరాగా పనులు చేశాడని గ్రామాల ప్రజలు అంటున్నారు. విద్యుత్ స్తంభాలను నాటేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా విద్యుత్ లైన్ ను వేసిన సంబంధిత కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు..రికవరీ చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్దలైన్ విద్యుత్ వైర్లు కావడంతో.. రోడ్డుపై స్తంభం పడి ప్రాణ నష్టం సంభవిస్తే బాధ్యత ఎవరిదని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు


Similar News