baby goats : మేక పిల్లల పై ఊర కుక్కల దాడి..

మండల పరిధిలోని లోకిరేవు గ్రామానికి చెందిన నీరెటి వెంకటయ్య, పద్మమ్మ దంపతులకు చెందిన 10 మేక పిల్లలను ( baby goats ) ఊర కుక్కలు దారుణంగా చంపాయి.

Update: 2024-10-26 08:43 GMT

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని లోకిరేవు గ్రామానికి చెందిన నీరెటి వెంకటయ్య, పద్మమ్మ దంపతులకు చెందిన 10 మేక పిల్లలను ( baby goats ) ఊర కుక్కలు దారుణంగా చంపాయి. తమ పశువుల పాకలో ఏర్పాటు చేసిన ఇనుప జాలిలో మేక పిల్లలను దాచి ఉంచి దంపతులు ఇద్దరు మేకలను మేపడానికి గ్రామ పరిసరాలలోని పచ్చిక బయల్లలోకి వెళ్లారు. అదే సమయంలో అటుగా గుంపుగా వచ్చిన ఊర కుక్కలు జాలిని చిందర వందర చేసి అందులో దాచి ఉంచిన మేక పిల్లల పై దారుణంగా దాడిచేసి చంపి వేశాయి.

మేక పిల్లల పై కుక్కలు దాడి చేయడం చూసిన ఇరుగు పొరుగు వారు అందించిన సమాచారం మేరకు అక్కడికి తిరిగి వచ్చిన పద్మమ్మ, వెంకటయ్య దంపతులు వాటిని చూసి లబోదిబోమన్నారు. కుక్కల దాడిలో మృతి చెందిన మేక పిల్లల విలువ సుమారు లక్ష రూపాయలకు పైగా ఉంటుందని, అధికారులు స్పందించి తమకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు వేడుకున్నారు.


Similar News