ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థుల పాదయాత్ర..అసలేం జరిగిందంటే..?

ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కార్యాలయానికి పాదయాత్ర చేశారు.

Update: 2024-12-24 09:26 GMT

దిశ , ఆలంపూర్,ఎర్రవల్లి: ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్ర చేశారు. రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని,మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని వాపోతున్నారు. ప్రిన్సిపాల్ పై చర్య తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ..20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరిన ఘటన ఎర్రవల్లి మండలంలో చోటుచేసుకుంది.

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వందమందికి పైగా పాదయాత్రగా బయలుదేరారు. తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ..నినాదాలు పలికారు. ప్రిన్సిపాల్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు వాపోయారు. రోడ్డుపై విద్యార్థులు వెళుతుంటే పాఠశాలలో ఏం జరిగిందోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పిల్లలు అంత దూరం పాదయాత్ర చేస్తున్న విషయం అధికారులకు తెలిసిన ఎందుకు స్పందించడం లేదని, నేరుగా వారే వచ్చి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూస్తూ ఎలా ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎలా అని సోషల్ మీడియాలో పోస్టులు చేసి మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

 


Similar News