ఎన్నికల ఓటరు జాబితా నుండి తొలగింపు ప్రక్రియ పకడ్బందీగా జరగాలి : కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఈ ఏడాది సాధారణ ఎన్నికలు ఉన్నందున గత సంవత్సరం నుండి ఎన్నికల జాబితా నుండి తొలగించిన పేర్లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.
దిశ, ప్రతినిధి నారాయణపేట : ఈ ఏడాది సాధారణ ఎన్నికలు ఉన్నందున గత సంవత్సరం నుండి ఎన్నికల జాబితా నుండి తొలగించిన పేర్లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. శుక్రవారం ఆర్దీఓ కార్యాలయంలో సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఒకే రకమైన ఫోటోలు, ఒకే ఓటరు వేరువేరు చోట్ల నమోదు అయి ఉంటే, మరణించిన ఓటర్లు, స్థానికంగా లేకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించినట్లయితే తొలగించిన పేర్లను పునఃపరిశీలించాల్సిందిగా సూచించారు.
కాగ క్షేత్ర స్థాయిలో వెళ్లి తీసుకున్న వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఫారం 7 క్షుణ్ణంగా పరిశీలించి తొలగించిన వాటి వివరాలను పార్టీల నాయకులకు అందజేయలన్నారు. స్థానికంగా లేకపోవడం వంటి విషయంలో సంబంధిత చిరునామాకు నోటీసు ఒకటికి రెండుసార్లు పంపించి పూర్తి విచారణ అనంతరమే పేరును తొలగించాల్సి ఉంటుందన్నారు. ఆర్డీవో రామచందర్ తాసిల్దార్ దానయ్య, డిప్యూటీ తాసిల్దార్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.