మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. ఔరా అంటున్న గద్వాల జిల్లా ప్రజలు

ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పోటీగా ప్రభుత్వ పాఠశాల

Update: 2024-10-21 08:35 GMT

దిశ,గద్వాల ప్రతినిధి : ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పోటీగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దెందుకు టీచ్ ఫర్ చేంజ్ లో భాగంగా డిజిటల్ క్లాస్ ల ఏర్పాటు చేయడం జరుగుతుందని సినీ యాక్టర్ మంచు లక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె గద్వాల పట్టణానికి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఆమె జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ తో ఆమె ప్రత్యేక భేటీ కావడం జరిగింది. అనంతరం మీడియా తో మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ లో భాగంగా అక్షరస్యత లో వెనుకబాటు గురైన ప్రాంతాల్లో మెరుగైన విద్యను విద్యార్థులకు అందించేందుకు పెగసిస్ సిస్టం కంపెనీ ఆర్థిక సహకారం తో ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాస్ ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.

గతంలో గట్టు మండలం లోని 30 ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ క్లాస్ ల నిర్మాణం చేసామని, ఈ సంవత్సరం కూడా మరో 20 ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ ల నిర్మాణం చేస్తున్నామని ఆమె తెలిపారు. అక్షరాస్యత లో వెనుకబడిన గట్టు ప్రాంతాన్ని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తమ సంస్థ ద్వారా గట్టు మండలం లోని ఆలూర్ గ్రామంలో సోమవారం డిజిటల్ క్లాస్ ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సోమవారం గద్వాల పట్టణానికి రావడం జరిగిందన్నారు. గట్టు మండలం లో అధ్యాపకులు లేరన్న సమాచారం మేరకు తమ సంస్థ తరపున విద్య వాలంటీర్లను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెగాసెస్ ప్రతినిధులు, టీచ్ ఫర్ చేంజ్ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.


Similar News