ఉప్పొంగిన సరళమ్మ ..మళ్ళీ తెరుచుకున్న ఆటోమేటిక్ సైఫన్లు
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మండల కేంద్రంలోని సరళాసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
దిశ, మదనాపురం:- ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మండల కేంద్రంలోని సరళాసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మంగళవారం గాలి పీడనం ద్వారా మూడు ఉడ్ సైఫన్లు, ఒక ప్రైమరీ సైఫన్ తెరుచుకొని సుమారు నీటిని దిగువకు విడుదల చేస్తూ పర్యాటకులను కనువిందు చేసింది. అదేవిధంగా మదనాపురం రైల్వే గేట్ సమీపంలో మారెడ్డిపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో, కొత్తకోట-ఆత్మకూరు అమరచింత మక్తల్ పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ రెనాల్ రెడ్డి తెలిపారు. ఆత్మకూర్, అమచింత, మక్తల్, నర్వ మండలాలకు వెళ్లే ప్రయాణికులు రామన్పాడ్ ప్రాజెక్టు మీద నుంచి వెళ్లవలసిందిగా ఎస్సై శేఖర్ రెడ్డి కోరారు.