గొప్ప మనసు చాటుకున్న హెడ్ కానిస్టేబుల్.. ధైర్యసహసాలతో ప్రాణాలు తెగించి మరీ!

కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.

Update: 2024-09-01 09:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కుండపోత వర్షాలతో గుంటూరు కెనాల్ తెగిపోయి వరద ఉధృతికి కారు కొట్టుకుపోయిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారన్న విషయం తెలిసిందే. ఉప్పలపాడు కాలవలో పడి ఎర్రబాలెంకు చెందిన టీచర్ రాఘవేంద్రరావు, ఉప్పలపాడుకు చెందిన విద్యార్థులు సౌరీష్ బాబు, మాన్విక్ దుర్మరణం చెందారు. అయితే ఈ క్రమంలో నాగర్ కర్నూల్ నాగనూల్ వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా తక్షణమే స్పందించిన హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్ అండ్ కానిస్టేబుల్ రాములు ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి మరీ వ్యక్తిని కాపాడారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్, కానిస్టేబుల్ రాములను జిల్లా ఎస్పీ, డీజీపీ జితేందర్, ఐపీఎస్ అభినందించారు.

Telangana Police Twitter Video : https://x.com/TelanganaCOPs/status/1830160385313284576


Similar News