మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

పేద మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

Update: 2023-02-15 14:26 GMT

వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణే మా ధ్యేయం

దిశ, మహబూబ్ నగర్: పేద మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ కు సంబంధించిన విలువైన ఆస్తుల పరిరక్షణతో పాటు పేద ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కమిటీ సభ్యులను కోరారు. వారి సంక్షేమం కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నాలుగు కమిటీలు ఇచ్చే ప్రతిపాదనల మేరకు ఏప్రిల్ లో కార్యాచరణ ఉండబోతోందని మంత్రి తెలిపారు. స్థానిక కమిటీలో ప్రాతినిధ్యం లభించని వారికి రాష్ట్ర కమిటీ లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, మైనారిటీ నేతలు అన్వర్ పాషా, ఇక్బాల్, హనీఫ్, వాహబ్ తాజ్, జావేద్ బేగ్, కౌన్సిలర్లు పాషా, రాషద్, మోసిన్, అంజాద్, షబ్బీర్, జడ్పి కోఆప్షన్ సభ్యుడు అన్వర్, మీరాజ్, మక్బూల్ నిరంజన్, సజ్జు, మక్బుల్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News