MLA : అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు త్వరలో శంకుస్థాపన చేయాలి

అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వీలైనంత త్వరలో శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మంత్రులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Update: 2024-09-20 11:40 GMT

దిశ, అచ్చంపేట : అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వీలైనంత త్వరలో శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మంత్రులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. అలాగే నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న మన్నె వారి పల్లి వద్ద ఎస్ ఎల్ బి సి సొరంగ నక్కల గండి ప్రాజెక్టులో ముంపునకు గురైన నాలుగు గ్రామాలకు పూర్తిస్థాయిలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానంగా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన చేయాలని, నియోజకవర్గంలో అచ్చంపేట మండలంలోని నిర్మించ తలపెట్టిన నక్కల గండి జలాశయంలో భూములు, ఇల్లు కోల్పోయిన వారికి ఆర్ అండ్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం చెల్లించాలని మంత్రులను కోరారు.

అలాగే అక్కారం గ్రామ శివారులో అచ్చంపేట దేవరకొండ రహదారిపై ఐలవలు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా డిస్ట్రిబ్యూటరి -1 డిండి బాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా అక్కారం , ఘనపురం, మన్నె వారి పల్లి గ్రామాలతో పాటు 15 తండాలకు సాగునీరు అందించేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కల్వర్టులు రోడ్లు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, వాటికి త్వరగా నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేల బృందం ఉన్నారు.


Similar News