వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి..నర్సులపై వేటు
మండల పరిధిలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ రజిత కాన్పు కోసం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చేరింది.
దిశ,మహమ్మదాబాద్/ గండీడ్: మండల పరిధిలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ రజిత కాన్పు కోసం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చేరింది. అదేరోజు రాత్రి బిడ్డకు జన్మనిచ్చిన రజిత గురువారం ఉదయం చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలింత మృతి ఘటనలో ఇద్దరు నర్సులను వైద్య అధికారి సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కుటుంబీకులకు న్యాయం చేస్తామని హామీతో ఆందోళన విరమించారు.