ప్రజా విజయోత్సవ రైతు పండుగకు సీఎం రాక
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ రైతు పండగకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రానున్నారు.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ రైతు పండగకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రానున్నారు. సాయంత్రం మూడు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట నుంచి బయలుదేరి సాయంత్రం మూడున్నర గంటలకు భూత్పూరు చేరుకుంటారు. నాలుగు గంటల 15 నిమిషాలకు సభాస్థలికి చేరుకొని నాలుగున్నర గంటల నుంచి కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరుకానున్న రైతులు, ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. 6 గంటలకు కార్యక్రమాలు ముగించుకొని ఆయన తిరిగి అదే హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరుతారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు భారీ ఎత్తున జన సమీకరణకు సిద్ధం అయ్యారు.