ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా జరగాలి

రైతు దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా జరిగేలా ప్రతి పోలీసు బాధ్యతతో,సమర్దవంతంగా నిర్వర్తించాలని మల్టీ జోన్ ఐజి సత్యనారాయణ ఆదేశించారు

Update: 2024-11-29 15:50 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రైతు దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా జరిగేలా ప్రతి పోలీసు బాధ్యతతో,సమర్దవంతంగా నిర్వర్తించాలని మల్టీ జోన్ ఐజి సత్యనారాయణ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ జానకితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశం,హెలిప్యాడ్,బహిరంగ సభకు వచ్చే పార్కింగ్ స్థలాలను పరిశీలించిన..అనంతరం వాసవి కన్వెన్షన్ హాల్ లో పోలీస్ అధికారులు,పోలీస్ సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు. పర్యటన ప్రాంతాల విభాగాల వారిగా బాధ్యతలను కేటాయించడంపై స్పష్టమైన మార్గదర్శకాలతో పాటు..భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ముఖ్యమైన సూచనలను చేశారు. పర్యటన ప్రాంతం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతకు 8 మంది ఎస్పీలు,9 ట్రైనీ ఐపీఎస్ లు,8 గురు అదనపు ఎస్పీలు,20 మంది డిఎస్పీలు,40 మంది సిఐలులతో పాలు..95 మంది ఎస్ లు,380 మంది ఏఎస్ఐ లు,680 మంది పోలీస్ కానిస్టేబుళ్ల,180 మంది వుమెన్ కానిస్టేబుల్స్,325 మంది హెడ్ గాడ్స్,267 మంది సిటి ట్రాఫిక్,౧ ప్లాటూన్ గ్రేహౌండ్స్ పార్టీ,2 ప్లాటున్స్ టిజిఎస్పీస్ పోలీస్ సిబ్బంది మోహరించబడతారని ఐజి వివరించారు. రైతులు,ప్రముఖులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ,భద్రతా ఏర్పాట్లలో సమన్వయానికి కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తూ..శాంతిభద్రతలు పరిరక్షణ చర్యలు చేపడతామని ఆయన తెలిాపారు. 


Similar News