Srisailam: శ్రీశైలానికి భారీగా పెరిగిన వరద.. మరో రెండు గేట్లు ఎత్తిన అధికారులు
ఎగువ ఉన్న కర్ణాటకలోని సుంకేసుల బ్యారేజీ దాని దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ పరుగులు పెడుతూ వడివడిగా వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతూ ఉరుకులు పరుగులతో కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగున్నర లక్షలకు పైగా క్యూసెక్కుల వరద జలాలు చేరుతున్నాయి.
దిశ, అచ్చంపేట: ఎగువ ఉన్న కర్ణాటకలోని సుంకేసుల బ్యారేజీ దాని దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ పరుగులు పెడుతూ వడివడిగా వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతూ ఉరుకులు పరుగులతో కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగున్నర లక్షలకు పైగా క్యూసెక్కుల వరద జలాలు చేరుతున్నాయి. సోమవారం సాయంత్రం ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు నీటిని వదిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అయితే మంగళవారం జూరాల నుంచి త్వరగా మరింత అధికంగా వస్తున్న క్రమంలో ఉదయం 11 గంటల తర్వాత మరో రెండు గేట్లను అధికారులు పైకి ఎత్తి మొత్తంగా ఐదు క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,78,288 క్యూసెక్కుల వరద వస్తుండగా, సుంకేసుల బ్యారేజీ నుంచి 1,29,513 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో మొత్తంగా 4,50, 570 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు కాగా 215.87 టీఎంసీల సామర్థ్యం నీటి నిలువ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో మంగళవారం మధ్యాహ్నం నాటికి 882. 70 అడుగులు చేరుకోగా 202.9673 టీఎంసీల సామర్థ్యం చేరుకుంది.
ఉగ్రరూపంతో సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని 1.96 లక్షల క్యూసెక్కుల వరద జలాలు దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు వదిలారు దీంతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 26,142 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35, 315 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ వైపు వదులుతున్నారు. కృష్ణమ్మ అందాలు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రాజెక్టు సమీపంలో ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.