కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి
పేదల ఇలవేల్పు పేదల తిరుపతి గా పేరుగాంచిన.. శ్రీ కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 2 నుంచి ప్రారంభం కానున్నాయి.
దిశ, దేవరకద్ర/చిన్న చింతకుంట: పేదల ఇలవేల్పు పేదల తిరుపతి గా పేరుగాంచిన.. శ్రీ కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, దేవస్థానం చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి అర్చకులు బృందం ఆలయ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనని కలిశారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు తప్పకుండా వస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, కౌకుంట్ల మండల అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, అర్చకులు, దేవాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.