ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి : అచ్చంపేట ఎమ్మెల్యే
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం
దిశ,చారకొండ: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మండల పరిధిలోని తుర్కలపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వారికున్న ఇబ్బందులు,కావలసిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించేందుకు సీఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తామని,పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలని ఉపాధ్యాయులను కోరారు. అంతకుముందు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చారకొండ,తుర్కలపల్లి లలో అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేశారు.మండల నాయకులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు , స్థానిక నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.