Minister Jupalli Krishna Rao : నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం..
పాఠశాలల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు.
దిశ, చిన్నంబావి : పాఠశాలల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల’కార్యక్రమంలో భాగంగా పాఠశాల మౌలిక వసతుల కోసం రూ.14,75 లక్షలతో చేపట్టిన నిర్మాణ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. పాఠశాల ఆవరణంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్మించిన పనులను ప్రత్యేకంగా పరిశీలించి మంత్రి మాట్లాడుతూ వెల్లటూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో అధునాతన హంగులతో నిర్మించిన తరగతి గదులను చాలా చక్కగా ఉన్నాయని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం ఒక శుభసూచికమని, ప్రాథమిక పాఠశాలకు చెందిన దీక్షిత అనే విద్యార్థి ఇంగ్లిష్ భాషలో మాట్లాడం చాలా ఆబ్భురపరిచిందని, పాఠశాలలో రోజు వారీగా జరిగే కృత్యాలను పిల్లల ఇంటికి రాగానే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి అదనపు అంశాలని నేరించ్చాలని తల్లిదండ్రులకు సూచించారు.
పాఠశాలల సమయం కాక అదనపు సమయం పాఠశాలలో ఉండే విధంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రస్తుతం బదిలీల కారణంగా కొన్ని పాఠశాలలో ఖాళీలు ఏర్పడ్డాయని వాటిని ప్రస్తుతం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల ద్వారా అధిగమిస్తామని మంత్రి అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. మండలంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 28 ఉండగా 1600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని ఆయా పాఠశాలలకు ప్రతి రోజూ ఒక ఇంగ్లిష్ పేపర్ తోపాటుగా తెలుగు దినపత్రికలను ప్రతి పాఠశాలకు పంపేందుకు మంత్రి స్వయంగా రూ.50,000 వేల రూపాయలను అందించారు. వెల్లటూరు గ్రామ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు మరో రూ.25 లక్షలను అయ్యవారి పల్లి పాఠశాలలకు రూ.15 లక్షల రూపాయలను కేటాయించారు. విద్యకోసం దాతలను సైతం కలుస్తామని విద్యయే అన్నింటి మూలమని, దీనికోసం ప్రతి ఒక్క నాయకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.
మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తామని మంత్రి అన్నారు. ఉన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలను వాలంటీర్లను నియమించిన కేఏంఆర్ ట్రస్ట్ చైర్మన్ కొత్త కళ్యాణ్ రావుని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మండల కేంద్రంలోని రూ.31 లక్షలతో నిర్మించిన మండల వనరుల కేంద్ర భవనాన్ని మంత్రి ప్రారంభించి మండల కేంద్రంలోని కస్తూర్భ గాంధీ పాఠశాలను సందర్శించారు. కొప్పునూరు గ్రామంలో గుండెపోటుతో మరణించిన కత్తి నాగస్వామి (43) మరణించిన విషయం తెలుసుకున్న మంత్రి నాగస్వామి మృతి దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు, మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, బీచ్పల్లి యాదవ్, కొత్త కళ్యాణ్ రావు, రామచంద్ర రెడ్డి, చిదంబర్ రెడ్డి, ఇదన్న, ఇందిరా, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.