వైభవంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి రథోత్సవం..
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.
దిశ, మాగనూరు: మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. మండలం నుంచే గాక మహారాష్ట్ర, హైదరాబాద్ ఇతర ప్రదేశాల నుంచి జాతరను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తమ కోరికలను తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు. సాయంత్రం పాలట్లు ఘనంగా నిర్వహించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వాకిటి వాబయ్య, డి ఆంజనేయులు, పి బాలు, మక్తల్ సీఐ సీతయ్య ఆధ్వర్యంలో జాతరలో బందోబస్తు నిర్వహించారు. మక్తల్ సీఐ సీతయ్యకు ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.