విద్యలో రాణించి ఉన్నత స్థానాలు అధిరోహించాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
బాల బాలికలు విద్య లో రాణించి ఉన్నత స్థానాలు అధిరోహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా గురుకులాల్లో చేరిన విద్యార్థులు వేసవి సెలవుల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ని ఆప్యాయంగా కలిశారు.
దిశ ప్రతినిధి, నారాయణపేట: బాల బాలికలు విద్య లో రాణించి ఉన్నత స్థానాలు అధిరోహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా గురుకులాల్లో చేరిన విద్యార్థులు వేసవి సెలవుల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ని ఆప్యాయంగా కలిశారు. ఈ సంద్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ గురుకులాలు చాలా ఉత్తమమైన పాఠశాలలు అని, అందులో చదువుకోవడం గొప్ప అదృష్టమన్నారు.
అన్ని విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలని, నేర్చుకోవడానికి హద్దులు లేవన్నారు. గురుకులాల్లో చదువులు, వసతులు గూర్చి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనివార్య కారణాల వల్ల మధ్యలో చదువు మానేసిన పిల్లలు ఓపెన్ స్కూల్స్ లో చేరి పది, ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.