ఆర్టీసీ డ్రైవర్‌ అతి వేగం,నిర్లక్ష్యం వల్ల ఏం జరిగిందో చూడండి

ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతి వేగం ప్రయాణికులను తీవ్ర గాయాలపాల్జేసింది.

Update: 2024-11-22 10:02 GMT

దిశ ,నాగర్ కర్నూల్ : ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతి వేగం ప్రయాణికులను తీవ్ర గాయాలపాల్జేసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్త పల్లి మండలం చంద్రకల్ గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. దీంతో స్థానికులు గాయపడిన వారిని జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రయాణికుల తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ డిపో చెందిన ఆర్టీసీ బస్సు కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. కొల్లాపూర్ ,పెద్ద కొత్తపల్లి తదితర గ్రామాలకు చెందినవారు నాగర్ కర్నూల్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగంతో నడుపుతూ..స్పీడ్ బ్రేకర్లు ఉన్నచోట కూడా వేగంగా వెళ్లడంతో ప్రయాణికులు ఒకరి సీటుపై మరొకరు పడ్డారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మోకాలు,తల,మోచేతి భాగాలతోపాటు ఎదలపై బలంగా గాయాలు తగిలాయి. దీంతో కండక్టర్ ,బస్సు డ్రైవర్ తో ప్రయాణికులు గొడవకు దిగారు.  అనంతరం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి ప్రయాణికులకు చికిత్స అందించారు. సుమారు 72 మంది ప్రయాణిస్తుండగా..18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. 


Similar News