దిశ ఎఫెక్ట్..విధుల నుంచి అధికారుల తొలగింపు
మరికల్ మండలం కన్మనూరు గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 2 కోట్ల 70 లక్షల ఉపాధి హామీ పనులు దుర్వినియోగం అయిన విషయంపై నవంబర్ 13న ఉపాధి హామీ డబ్బులు మాయం అనే శీర్షికతో 'దిశ'లో వచ్చిన కథనం తో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎట్టకేలకు స్పందన లభించింది.
దిశ, నారాయణపేట : మరికల్ మండలం కన్మనూరు గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 2 కోట్ల 70 లక్షల ఉపాధి హామీ పనులు దుర్వినియోగం అయిన విషయంపై నవంబర్ 13న ఉపాధి హామీ డబ్బులు మాయం అనే శీర్షికతో 'దిశ'లో వచ్చిన కథనం తో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎట్టకేలకు స్పందన లభించింది. ఉపాధి హామీ పనుల అవకతవకలపై మరికల్ మండలం కన్మనూరు ఫీల్డ్ అసిస్టెంట్ మతిన్, మాజీ ఇంచార్జ్ ఏపీవో చంద్రశేఖర్లను కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశాల మేరకు విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డిఆర్డిఓ ఒక ప్రకటనలో తెలిపారు. మరికల్ మండలం కన్మనూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై ఎంపీడీవో మక్తల్ తనిఖీ నిర్వహించి..కలెక్టర్ కు నివేదికను సమర్పించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా వారిద్దరిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు తెలిపారు.