బీసీల రిజర్వేషన్లు యాభై శాతానికి తగ్గకుండా చూడాలి

బీసీల రిజర్వేషన్లను 50 శాతంకు తగ్గకుండా అమలు చేయాలని ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ విజ్ఞప్తి చేశారు

Update: 2024-11-22 16:07 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బీసీల రిజర్వేషన్లను 50 శాతంకు తగ్గకుండా అమలు చేయాలని ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో..నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన మాట్లాడారు. అనేక బీసీ,యంబీసీ,ఉత్పత్తి కులాలు ఈ రోజు వరకు విద్య,రాజకీయ,ఆర్థిక పరంగా ప్రాధాన్యత లేక చాలా వెనకబడి ఉన్నారని,ప్రస్తుత తరుణంలో జరుగుతున్న కుల గణన ఆధారంగా వారికి చట్ట సభలో ప్రవేశించడానికి అవకాశాలు కల్పించాలని కమీషన్ ద్వారా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈడబ్ల్యూఎస్ పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంలో నేడు చాలా మంది నిరుద్యోగులుగా మారడం జరుగుతుందని,బీసీల రిజర్వేషన్లు అగ్రకులాల వారు తీసుకువెళ్తున్నారన్నారు. వారి లెక్క తేల్చి,మిగిలిన శాతాన్ని బీసీలకు కలిపి విద్య,ఉద్యోగ,రాజకీయ పరంగా ముందుకు పోయే విధంగా కృషి చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Similar News