కడుపునొప్పి భరించలేక ఉరేసుకున్న వివాహిత
కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
దిశ, ఉండవెల్లి (అలంపూర్): కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా బ్రాహ్మణకొట్కూరు చెందిన స్వాతికి(20) ఉండవల్లి గ్రామానికి చెందిన మధుబాబుతో గత రెండేళ్ల కిందట వివాహం అయ్యింది. స్వాతికి ఏడాది నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ..ఎన్నో ఆసుపత్రులకు వెళ్లిన తగ్గలేదు. దీంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మల్లేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై మహేష్ కేసు నమోదు చేశారు.