భూత్పూర్ లో దొంగల హల్చల్

మున్సిపల్ కేంద్రమైన భూత్పూర్ లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు హల్ చల్ చేశారు.

Update: 2024-09-23 09:48 GMT

దిశ, భూత్పూర్ : మున్సిపల్ కేంద్రమైన భూత్పూర్ లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు హల్ చల్ చేశారు. ఒక కారు, బొలెరో వాహనంలో వచ్చిన దొంగలు వ్యూహాత్మకంగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కాపర్ వైర్లను చోరీ చేసేందుకు వచ్చారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తమ వెంట తెచ్చుకున్న కట్టర్ తో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం రోడ్డు వైపుకు ఉన్న గేటు తాళాలను కట్ చేసి కాపర్ వైర్లను ముక్కలు ముక్కలుగా చేశారు. వాటన్నింటినీ ప్రభుత్వ ఆస్పత్రి వైపు ఉన్న చెట్ల క్రింద కు చేర్చి బొలెరో వాహనంలో తరలించేందుకు సన్నద్ధం అయ్యారు. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి గమనించి అదే రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సమయంలో దొంగలు వాహనాలలో పారిపోగా.. మరో ఇద్దరు, ముగ్గురు పరుగులు పెట్టి పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నారు. ఇద్దరే పోలీసులు రావడంతో దొంగలను పట్టుకోలేకపోయారని కంపెనీ వ్యక్తి తెలిపారు. ఈ మేరకు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


Similar News