అక్టోబర్ 5న గద్దర్ విగ్రహ ఆవిష్కరణ సభ

ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఆవిష్కరణ సభను అక్టోబర్ 5న నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Update: 2024-09-23 15:05 GMT

దిశ, ఖైరతాబాద్ : ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఆవిష్కరణ సభను అక్టోబర్ 5న నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గద్దర్ కూతురు వెన్నెల, బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, గద్దర్ గళం ప్రధాన కార్యదర్శి పసునూరి రవీందర్ లు మాట్లాడారు.. గద్దర్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో గద్దర్ విగ్రహాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్దర్ గళ ఫౌండర్ ప్రెసిడెంట్ కొల్లూరి సత్తయ్య, గౌరవ అతిథులుగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క, ప్రత్యేక అతిథులుగా బి.ఎస్.పి ఏపీ ,తెలంగాణ నేషనల్ కోఆర్డినేటర్ బాలయ్య, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, గోర్ల బుచ్చన్న తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు.


Similar News