Minister Jupalli : విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాల్లో రాణించాలి

విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Update: 2024-09-23 11:57 GMT

దిశ, కొల్లాపూర్ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని మినీ స్టేడియంలో సోమవారం 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అండర్ 14, అండర్ 17 బాల బాలికలకు కబడ్డీ కోకో వాలీబాల్ పోటీలను మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి శాంతి పతాకం మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు, వైస్ చైర్ పర్సన్ మహిమూదా బేగం ఖాదర్ పాషా, కౌన్సిలర్లతో కలిసి ఎగురవేసి క్రీడాకారులతో మంత్రి కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ బడులను కార్పొరేట్ బడులకు ధీటుగా అభివృద్ధి చేస్తుందన్నారు. విద్యార్థులు ఉత్తమ విద్యతో పాటు క్రీడల్లో రాణించేందుకు ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చదువుతో పాటు ఆట, పాటలను నేర్చుకోవాలని,ఉజ్వల భవిష్యత్తు కోసం లక్ష్యాన్ని నిర్ణయించుకోవలంటే ఇదే సరియైన వయసు అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

ఈ పోటీల్లో కబడ్డీ, కోకో, వాల్ బాల్ పోటీలలో కొల్లాపూర్ డివిజన్ లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి క్రీడా కాగడను పట్టుకొని గ్రౌండ్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు పరిగెత్తారు. విద్యార్థులను ఉత్సాహపరిచడం కోసం విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం కోసం ఇదే మంచి సమయమన్నారు. విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలంటే విద్యార్థులు కష్టపడి చదవాలని, టీవీలలో పిచ్చి పిచ్చి షో లు చూసి చెడు మార్గానికి ఆకర్షితులు కావద్దని మంత్రి స్పష్టం చేశారు. పుస్తకాలు చదువుతూ విజ్ఞానం పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నరసింహారావు, నయీమ్, రహీం పాషా, శిరీష యాదవ్, ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ఆయా మండలాలలోని వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


Similar News