ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించండి..
ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ఆదేశించారు.
దిశ, మహబూబ్ నగర్: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ కింది స్థాయిలో కూడా ఫిర్యాదులు అదేవిధంగా పరిష్కరిస్తే ఫిర్యాదుదారులు వారి సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు.
ఫిర్యాదుల పరిష్కారంపై ఎక్కువగా దృష్టి సారించి వారికి విషయాన్ని తెలియజేయాలని ఆయన అన్నారు. అదే విధంగా మండల స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారంపై మండల స్థాయి అధికారులు దృష్టి సారించాలని, ప్రతి సోమవారం సైతం ఎప్పటిలాగే భూములకు సంబంధించిన ఫిర్యాదులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన తదితర ఫిర్యాదులు వచ్చాయని ఆయన అన్నారు. డీఆర్డిఓ యాదయ్య, జడ్పీ సీఈవో జ్యోతి, ఆర్డిఓ అనిల్ కుమార్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.