ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, రెసిండెంట్ పోస్టుల భర్తీ

గద్వాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిన ప్రసూతి, గైనకాలజీ (ఓ బి జి) స్పెషాలిటీ తో అసోసియేట్ ప్రొఫెసర్లు - 2,

Update: 2024-09-20 09:49 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : గద్వాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిన ప్రసూతి, గైనకాలజీ (ఓ బి జి) స్పెషాలిటీ తో అసోసియేట్ ప్రొఫెసర్లు - 2, అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 3, సీనియర్ రెసిండెంట్స్ - 3 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 నుండి 25 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఫస్ట్ కం - ఫస్ట్ అపాయింట్మెంట్ పద్దతిన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. కాంట్రాక్టు పద్ధతిన ఎంపికైన అభ్యర్థులు మార్చి 31వ తేదీ 2025 వరకు పనిచేయాల్సి ఉంటుందని, ఇంటర్వ్యూలు మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ హాస్పిటల్, గద్వాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పూర్తీ వివరాలకు https://gadwal.telangana.gov.in/ వెబ్సైట్ లో జతచేసిన నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


Similar News