వాలీబాల్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే.. క్రీడకారులకు కీలక హామీ

Update: 2023-08-13 09:45 GMT

దిశ, బాలానగర్: బాలానగర్ మండల పరిధిలోని చిన్నరెవల్లీ లో రఘుమారెడ్డి స్మారక 13 వ జిల్లా స్థాయి వాలీ బాల్ టోర్నమెంట్‌‌కు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజా యుద్ద నౌక గద్దర్ ఆత్మశాంతి కొరకు అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆటలు అనేవి మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి అనీ, ప్రతీ ఒక్కరూ క్రీడల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వం కూడా క్రీడల పట్ల ఎంతగానో దృష్టి పెట్టిందన్నారు. గ్రామంలో నూతనంగా S.I. లుగా ఎన్నికైన కొండే రాఘవేందర్, రమేష్ నాయక్‌లను సన్మానించి, అభినందించారు.


అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టోర్నమెంట్‌ను ప్రారంభించి, క్రీడాకారులకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చారు. క్రీడారంగంలో రాష్ట్ర దశ దిశలా నైపుణ్యం కనబరుస్తున్న చిన్న రెవల్లి క్రీడాకారులకు ఒక గ్రౌండ్ లేకపోవడం.. కొంత నష్టం కలిగించే పరిస్థితి ఉందన్న గ్రామస్తులు, క్రీడాకారుల విన్నపం మేరకు నూతన ఆట స్థలాన్ని త్వరలోనే కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ హామీ పట్ల యువకులు క్రీడాకారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రమౌళి, ఉప సర్పంచ్ దండు కృషయ్య, GCC చైర్మన్ వాల్యా నాయక్, గ్రామ పెద్దలు, క్రీడాకారులు, గ్రామస్థులు పాల్గోన్నారు.


Similar News