సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్నిఆవిష్కరించిన మంత్రి

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి,ఉద్యమ నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆవిష్కరించారు.

Update: 2024-10-18 10:50 GMT

దిశ,గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి,ఉద్యమ నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టరేట్  నుంచి ర్యాలీగా బయలుదేరి విగ్రహావిష్కరణ స్థలానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.


Similar News