బీఆర్ఎస్ సర్కార్ మాపై అప్పుల భారం మోపింది :మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ..అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు
దిశ ,గద్వాల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ..అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏడు లక్షల అప్పు మోపి బీఆర్ఎస్ పార్టీ తమపై ఆర్థిక భారం మోపిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి మరో 40 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుపై భారం మోపిందని, రాష్ట్ర ప్రజలకు కార్యకర్తలు వివరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కృష్ణ వేణి చౌక్ లో జోగుళాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా.. నీలి శ్రీను ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏ ఐ సి సి సెక్రటరీ సంపత్, గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరిత తిరుపతయ్య,రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు ల పై ప్రత్యేక దృష్టి వున్నదని,జూరాల, నెట్టంపాడు,భీమా, తుమ్మిల్ల, గట్టు ఎత్తిపోతల పథకాలపై రేవంత్ రెడ్డి వ్యవసాయానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. అధికారం లోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించామని, సుమారు వంద కోట్ల మహిళలు ఇప్పటివరకు ప్రయాణం చేశారని ఆయన తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రాని వారు స్థానిక కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల హామీలో రెండు లక్షల లోపు వ్యవసాయ రుణం చేస్తామన్న హామీ ఇప్పటికీ కట్టుబడి వున్నామన్నారు. ప్రతిపక్షాలు అనవసర అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ తూచ తప్పకుండా అమలు చేసి చూపెడుతామని తెలిపారు. త్వరలోనే బీసీ కుల గణన చేపడుతున్నామని బీసీ లకు స్థానిక ఎన్నికల్లో లాభం చేకూరుతుందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాలను ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్, మధుబాబు, ఆనంద్, ఇస్సాక్, సీతారాం రెడ్డి,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.