జాతీయ రహదారి పనులను పరిశీలించిన మంత్రి

కల్వకుర్తి - నంద్యాల జాతీయ రహదారి 167_కే నిర్మాణంలో భాగంగా కొల్లాపూర్ నుంచి చౌటబేట్ల గ్రామానికి వెళ్ళే రోడ్డులో తక్కువ ఎత్తులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎత్తును పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులకు సూచించారు.

Update: 2024-10-18 13:29 GMT

దిశ, కొల్లాపూర్ : కల్వకుర్తి - నంద్యాల జాతీయ రహదారి 167_కే నిర్మాణంలో భాగంగా కొల్లాపూర్ నుంచి చౌటబేట్ల గ్రామానికి వెళ్ళే రోడ్డులో తక్కువ ఎత్తులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎత్తును పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులకు సూచించారు. భవిష్యత్తులో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తనుందని, బ్రిడ్జి ఎత్తు పెంచాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కు చౌట బెట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్,కమలాకర్ రావు ప్రజలతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈమేరకు స్పందించిన మంత్రి జూపల్లి చౌటబట్ల గ్రామస్తులతో కలిసి శుక్రవారం కొల్లాపూర్ పట్టణ సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న పనుల ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జి ఎత్తును పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు.


Similar News