జడ్చర్ల ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో ర్యాగింగ్ భూతం

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లో ర్యాగింగ్ భూతం బయటపడింది, గత రెండు మూడు రోజులుగా హాస్టల్‌లో సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థి ని చితక బాదడు.

Update: 2023-03-20 06:23 GMT

దిశ, జడ్చర్ల :జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లో ర్యాగింగ్ భూతం బయటపడింది, గత రెండు మూడు రోజులుగా హాస్టల్‌లో సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థి ని చితక బాదడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకొని ఆందోళన దిగారు. జడ్చర్ల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో ఉండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థి హాస్టల్‌లో తాను చెప్పినట్లు వినాలని, తాను చెప్పిన పని చేయలని, తను చెప్పినట్లు డాన్సులు చేయాలంటూ విద్యార్థి పై పెత్తనం చెలాయిస్తూ.. జూనియర్ విద్యార్థి వినకపోవడంతో ఇష్టం వచ్చినట్లు కట్టెలతో కొట్టడం తో, పదవ తరగతి విద్యార్థి టార్చర్ భరించలేక బాదిత విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పడంతో.. విద్యార్థి తల్లిదండ్రులు సోమవారం హాస్టల్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.

హాస్టల్‌లో ఉండి చదువుతున్న పదవ తరగతి విద్యార్థి, తాను ఏది చెప్పినా మీరందరూ వినాలని, ఒకసారి చెప్తే వినాల్సిందే అని ఆదేశాలు ఇస్తుండేవాడని తాము ఎందుకు చేయాలని ప్రశ్నిస్తే నాకెదురు ప్రశ్నిస్తావా.. ఇంతవరకు ఎవరు ప్రశ్నించలేదని, తన ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. హోలీ పండుగ కంటే ముందు రాత్రి వేళలో నిద్రలో నుంచి లేపి డాన్సులు చేయాలని బెదిరించాడు. తాను డాన్సులు చేయకపోవడంతో తన ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఈ విషయం బయటకు చెబితే ఇంతకు నాలుగింతలు రెట్టింపు దెబ్బలు తింటావని బెదిరించేవాడు. అలాగే తన బట్టలు కూడా ఉతకాలని ఆదేశించేవాడని శనివారం రాత్రి మరోసారి కట్టెలు తీసుకుని తాను చెప్పినట్లు వినడం లేదని ఇష్టం వచ్చినట్టు కొట్టాడని,బాధిత 9వ తరగతి విద్యార్థి తెలిపాడు.

తమ కుమారుడు పై దాడి చేసిన విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని తమ కుమారుడికి రక్షణ కల్పించాలని, విద్యార్థులు తల్లిదండ్రుల హాస్టల్ వద్ద చేరుకొని హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. తమ కుమారుడిపై దాడులు జరిగిన హాస్టల్ వార్డెన్ పట్టించుకోకపోవడం ఏంటని నిలదీశారు. హాస్టల్‌లో వార్డెన్ పనితీరు సక్రమంగా లేదని తమ కుమారుడి పట్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ చితకబాదాడని హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ చేయగా తాను పదిన్నర తర్వాత వస్తానని, తనకు వేరే పనులు ఉన్నాయని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.

ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ రవి నాయక్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ హాస్టల్ వార్డెన్ 10వ తరగతి విద్యార్థి వివరాలు సేకరించి అధికారులను పంపించి విచారణ చేపడతామని విద్యార్థి తల్లిదండ్రులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. హాస్టల్ వద్దకు చేరుకున్న ఎస్ఐ లెనిన్ గౌడ్ పదవ తరగతి విద్యార్థికి విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మా కుమారుడికి హాస్టల్లో రక్షణ కల్పించాలని హాస్టల్‌లో నిర్లక్ష్యంగా వహించిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News