బంద్ నిర్వహిస్తున్న కళాశాల యాజమాన్యాలు.. నష్టపోతున్న విద్యార్థులు..

జోగులాంబ గద్వాల జిల్లాలో వున్న ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు రావాల్సిన ఫీజు బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మంగళవారం నుంచి జిల్లాలో డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ నిర్వహిస్తున్నాయి.

Update: 2024-10-15 06:02 GMT

 దిశ, గద్వాల ప్రతినిధి : జోగులాంబ గద్వాల జిల్లాలో వున్న ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు రావాల్సిన ఫీజు బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మంగళవారం నుంచి జిల్లాలో డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్త ప్రయివేట్ కళాశాలల యూనియన్ నాయకుల పిలుపు మేరకు నిర్వహిస్తున్న బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. జోగులాంబ గద్వాల జిల్లాలో తొమ్మిది కళాశాలలు ఉండగా 2001 సంవత్సరం నుండి ఇప్పటి ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించడంలేదని, అప్పులు తెచ్చి కళాశాలలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రయివేట్ యాజమాన్యాలు తెలుపుతున్నాయి. జిల్లాలో సుమారు ఆరు నుండి ఏడు కోట్ల వరకు పెండింగ్ ఫీజు బకాయిలు ప్రభుత్వం నుండి రావాల్సి వున్నదని యాజమాన్యం తెలిపింది. ప్రతీ సంవత్సరం కళాశాలలు నడపడం యాజమాన్యలకు త్రీవ ఆర్థిక భారం కలుగుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యాజమాన్యాలు తెలిపాయి. జిల్లాలో వున్నా ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు తాళాలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించే వరకు కళాశాలలను నడుపబోమని యాజమాన్యాలు కళాశాలలను బంద్ చేస్తున్నాయి.

నష్టపోతున్న విద్యార్థులు..

ప్రయివేట్ కళాశాలలు మంగళవారం నుండి నిరవధికంగా బంద్ ప్రకటించడంతో జిల్లాలో డిగ్రీ, పీజీ విద్యార్థులు త్రీవంగా నష్ట పోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కౌన్సిలింగ్ ద్వారా ప్రయివేట్ కళాశాలలో చేరిన విద్యార్థులు ఈ నిర్ణయంతో త్రీవ ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు కడితేనే స్టడీ సర్టిఫికెట్ లు ఇస్తామని విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయి. అకాడమిక్ సంవత్సరం నష్ట పోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.


Similar News